ఉద్యోగమా? ఉన్నత విద్యా?
డిగ్రీ తర్వాత పలు మార్గాలు
పీజీ కోర్సులు లేదా ప్రొఫెషనల్ కోర్సులు |
||
ప్రభుత్వ రంగ ఉద్యోగమా? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్పా?
టీచింగా లేదా జాబ్ ఓరియంటెడ్ కోర్సులా? వంటి అంశాలపై ఫోకస్ ఉన్నత విద్య- పీజీ ‘విజ్ఞానం’ ఉన్నతం: క్యాన్సర్‌పై పరిశోధనలైనా.. అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల గుట్టు విప్పేందుకు చేపట్టే అంతరిక్ష యాత్రలైనా.. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కటీ ‘సైన్స్’తో సంబంధమున్నదే! ఇలాంటి ‘విజ్ఞాన’రంగంలో+ ఉన్నత కెరీర్‌లో నిలదొక్కుకోవాలంటే నచ్చిన సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాల్సిందే! ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలు సంప్రదాయ సబ్జెక్టులుగా ఉన్నాయి. వీటికి దీటుగా ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2015-16లో ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ వంటి అధునాత స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్, ఎంఎస్సీ మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ వంటి స్పెషలైజేషన్లను అందిస్తోంది. వీటిని పూర్తిచేసి ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు. దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ)కి ప్రాధాన్యం ఏర్పడిన నేపథ్యంలో డీఆర్‌డీవో, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి పరిశోధన సంస్థల్లో ప్రవేశించి, నవ్య ఆవిష్కరణల్లో పాలుపంచుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ సైన్స్ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పించే కోర్సులు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ).. బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. అదే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. బీకామ్ తర్వాత పీజీ కోర్సులు బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్‌తో ఎంకామ్ పూర్తి చేయవచ్చు. అవి.. ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్, కార్పొరేట్ సెక్రటరీషిప్, మార్కెటింగ్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్‌ఎం). వీటిలో ప్రస్తుతం ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని యూనివర్సిటీలు ఎంకామ్‌లో ఫైనాన్స్ అండ్ కంట్రోల్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ వంటి వినూత్న స్పెషలైజేషన్లలో ఎంకామ్‌ను అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ, ఇతర ఆర్థిక సంబంధిత కార్పొరేట్ సంస్థల్లో ఫైనాన్స్ మేనేజర్లుగా, ఇంటర్నల్ ఆడిటర్స్‌గా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ స్పెషలైజేషన్‌లో ఎంకామ్ పూర్తిచేసిన వారు కంపెనీ సెక్రటరీకి సహాయకులుగా వైట్‌కాలర్ జాబ్‌ను చేజిక్కించుకోవచ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ పూర్తిచేసిన వారికి కంపెనీ సెక్రటరీ (సీఎస్) కోర్సులో కొన్ని పేపర్లలో మినహాయింపు లభిస్తుంది. అందువల్ల భవిష్యత్తులో తేలిగ్గా సీఎస్ కోర్సును పూర్తిచేసి, కెరీర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. బీకామ్ తర్వాత ఎల్‌ఎల్‌బీ (ట్యాక్స్ లాస్, కంపెనీ లాస్..) చేసి, కార్పొరేట్ కంపెనీల్లో మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) అనగానే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ు వంటి స్పెషలైజేషన్లు అందరికీ గుర్తొస్తాయి. అయితే ప్రస్తుతం ఎంఏలోనూ ఆధునిక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసిన వెంటనే ఉపాధి లభిస్తుంది. అందుకే వీటిని జాబ్ గ్యారంటీ స్పెషలైజేషన్లుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ), సోషియాలజీ, సైకాలజీ వంటి స్పెషలైజేషన్లను మాస్టర్ స్థాయిలో అందిస్తోంది. సోషల్ వర్క్, సోషియాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంంటాయి. ఎంబీఏ, ఎంసీఏ గ్రాడ్యుయేషన్ తర్వాత మేనేజ్‌మెంట్ విభాగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ను చేయొచ్చు. దీనికోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఐసెట్ లేదా జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్‌ఏటీ వంటి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంబీఏలో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతో పాటు జాబ్ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్జెక్టులు అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఉదాహరణలుగా రిటైల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్‌ను చెప్పొచ్చు. వీటిని పూర్తిచేస్తే సంబంధిత సంస్థల్లో ఎంట్రీలెవల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ఎంసీఏ: సాంకేతిక విద్య వైపు ఆసక్తి ఉంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ రంగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకునేందుకు చక్కటి ప్రత్యామ్నాయ మార్గమిది. ఈ కోర్సులో ప్రవేశానికి కూడా ఐసెట్ (ఇంటర్మీడియెట్ వరకు మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థులు మాత్రమే ఎంసీఏకు అర్హులు) రాసి, మంచి ర్యాంకు తెచ్చుకోవాలి. ఉపాధ్యాయ విద్య బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ కోర్సుల్లోకి ప్రవేశించాలంటే బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు పూర్తిచేయాలి. ఇందులో ప్రవేశాలకు ఎడ్‌సెట్ రాసి, మంచి ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. వీటికి ఉద్దేశించిన కోర్సులు లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిలో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎల్‌పీసెట్) రాయాలి. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు కొన్ని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసి, ఆధునిక కొలువులను సొంతం చేసుకోవచ్చు. వీటిలో కొన్ని.. ఫ్యాషన్ డిజైనింగ్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం, ఫార్మా, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ కోర్సులు, కార్పొరేట్ కమ్యూనికేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తదితరాలు. ఈ విభాగాలకు సంబంధించి పీజీ లేదా పీజీ డిప్లొమా, స్వల్ప కాలిక వ్యవధితో ఉండే డిప్లొమా కోర్సులను ఎంచుకోవచ్చు. విదేశీ భాషలు.. విదేశీ భాషల్లో నైపుణ్యాలు ఉన్నవారికి ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలుంటాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ రంగాల్లో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఫారెన్ లాంగ్వేజ్‌లు తెలిసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్ భాషలు తెలిసిన వారికి డిమాండ్ ఉంది. ఉస్మానియా, ఇఫ్లూ, జేఎన్‌యూ వంటి యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రిటేటర్, టీచింగ్, ఫ్రీలాన్సింగ్ విభాగాల్లో ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. ‘లా’లో కెరీర్ దేశంలో బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో ఇవి విస్తరణ పథంలో పయనిస్తున్నాయి. ఈ విభాగాల్లో న్యాయసేవల అవసరం పెరిగింది. దీంతో లా కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు చేయొచ్చు. రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయాలి. జాతీయ స్థాయి లా కళాశాలల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది. ఎల్‌ఎల్‌బీ పూర్తయ్యాక వివిధ స్పెషలైజేషన్లలో పీజీ కోర్సులు ఉన్నాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, కార్పొరేట్ లా, పేటెంట్ లా వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా బహుళజాతి, కార్పొరేట్ సంస్థల్లో, పేటెంట్ సంస్థల్లో లీగల్ అడ్వయిజర్స్‌గా, లీగల్ మేనేజర్స్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఉద్యోగమే లక్ష్యమైతే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. ప్రస్తుత తీవ్ర పోటీ వాతావరణంలో ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలంటే అకడమిక్ కోర్సులు చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధంకావాలి. రోజూ తాజా సమాచారాన్ని నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. ఆయా పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఇంటర్నెట్, పత్రికలు వంటి మాధ్యమాల ద్వారా సంబంధిత పరీక్షల సమాచారాన్ని క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. గత విజేతలు, నిపుణులు సూచించిన ప్రామాణిక మెటీరియల్‌తో సన్నద్ధతను సాగించాలి. అవసరమైతే కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు అనుభవానికే ప్రాధాన్యమివ్వాలి. ఫలానా ఉద్యోగమే’ కావాలని వేచిచూసి.. సమయం వృథా చేసుకోకుండా.. అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. అనుభవం సంపాదించాలి. తద్వారా ఆ రంగంలో ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలి. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే సంబంధిత రంగంలో ఉన్నత విద్య అవకాశాలను అన్వేషించాలి. ఉద్యోగాలు యూపీఎస్సీ- సివిల్స్, సీడీఎస్ ఎస్‌ఎస్‌సీ-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ట్యాక్స్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్(ఆడిట్, అకౌంట్స్, కమర్షియల్ ఆడిట్) ఎస్‌ఎస్‌సీ- సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఎస్‌ఐలు రైల్వే-ఏఎస్‌ఎం, గూడ్స్‌గార్డ్, సూపర్‌వైజర్, కమర్షియల్ క్లర్క్, రిజర్వేషన్ కం ఎంక్వైరీ క్లర్క్ బ్యాంకులు - క్లర్క్, పీవో, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఎల్‌ఐసీ - డీఓ, ఏఏవో, ఏవో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియామక పరీక్షలు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వెలువరించే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ తదితర పరీక్షల్లో ప్రతిభ ద్వారా ప్రభుత్వ కొలువును దక్కించుకోవచ్చు.
|
No comments:
Post a Comment