కొలువులకు కేరాఫ్.. ఈ కోర్సులు!
బెస్ట్ జాబ్..బెటర్ ‘పే’..బ్రైట్ ఫ్యూచర్...విద్యార్థుల జీవిత లక్ష్యాలు.. ఇవే అనడం నిస్సందేహం.
|
|||
కళ్లముందు
కోకొల్లలుగా కనిపిస్తున్న కోర్సులు.. అయితే, కొన్ని కోర్సులు మాత్రమే
కొలువులకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి.. ఒక చేత్తో సర్టిఫికెట్.. మరో చేత్తో
ఆఫర్ లెటర్ అందిస్తున్న కోర్సులివి.. జాబ్ మార్కెట్‌లో ఆ కోర్సులెంతో
హాట్..10+2/ ఇంటర్ పరీక్షలు రాసి.. కెరీర్ అన్వేషణలో ఉన్న విద్యార్థుల
కోసం..కచ్చితమైన కొలువులకు కేరాఫ్‌గా నిలుస్తున్న కోర్సులపై ప్రత్యేక
విశ్లేషణ..
ఐఐఎస్‌టీ - బీటెక్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నెలకొల్పిన సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన ఈ ఇన్‌స్టిట్యూట్ బీటెక్ స్థాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సెన్సైస్ బ్రాంచ్‌లను అందిస్తోంది. వీటితోపాటు బీటెక్+ఎంటెక్/ఎస్ పేరుతో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తోంది.
కోర్సు పూర్తి చేస్తే కొలువు ఖాయం: ఐఐఎస్‌టీ అందించే బీటెక్, బీటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇస్రో లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌లోని పలు విభాగాల్లో ఎంట్రీ లెవల్‌లో సైంటిస్ట్/ఇంజనీర్-ఎస్‌సీ హోదాలో ఉద్యోగం ఖాయం. అయితే విద్యార్థులు నాలుగేళ్ల కోర్సులో 7.5 సీజీపీఏ పొందడం తప్పనిసరి. వివరాలకు వెబ్‌సైట్: www.iist.ac.in యూపీఎస్‌సీ.. ఎస్‌సీఆర్‌ఏ కేంద్ర ప్రభుత్వ కొలువు, బీటెక్ డిగ్రీ రెండిటికీ మార్గం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) నిర్వహించే స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్(ఎస్‌సీఆర్‌ఏ). ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నిర్ణీత వ్యవధిలో శిక్షణ లభించడంతోపాటు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - మెస్రా నుంచి బీటెక్ డిగ్రీ కూడా చేతికందుతుంది. కోర్సు నాలుగేళ్ల కాలంలో నెలకు 9వేలకు పైగా స్టైఫండ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి భారతీయ రైల్వేలో ఇంజనీరింగ్ విభాగంలో కొలువు ఖాయమవుతుంది. ఇలా కొలువు సొంతం చేసుకున్న విద్యార్థులకు ఇండియన్ రైల్వేస్‌లో ఏడాదిన్నర వ్యవధిలో ప్రొబేషనరీ ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. ప్రొబేషనరీ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే రైల్వేలో శాశ్వత ఉద్యోగం లభించినట్లే.
ఐఐఎస్‌ఈఆర్.. బీఎస్-ఎంఎస్.. సైన్స్ రంగంలో కెరీర్ సైన్స్ రంగంలో కెరీర్ ఖాయం చేసుకోవాలనుకునే విద్యార్థులకు సరైన వేదికలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాంగణాలు. కోర్ సెన్సైస్‌లో ఔత్సాహికులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇన్‌స్టిట్యూట్‌లు దేశ వ్యాప్తంగా ఆరు (భోపాల్, కోల్‌కత, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి)ఉన్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న అయిదేళ్ల వ్యవధిలోని బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్, అణు శక్తి విభాగాలు తదితర విభాగాల్లో కొలువులు సులువవుతాయి. ఇంటిగ్రేటెడ్ బీఎస్- ఎంఎస్ వివరాలు.. ఐదేళ్ల బీఎస్- ఎంఎస్ కోర్సులోకి వివిధ మార్గాల్లో ప్రవేశం కల్పిస్తారు. ఎంపిక విధానం:
ముఖ్య తేదీలు:
గణాంక నైపుణ్యాలు.. కొలువులకు ఐఎస్‌ఐ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్.. ఉన్నత విద్య ఔత్సాహికులకు ముఖ్యంగా కామర్స్, స్టాటిస్టిక్స్ విద్యార్థులకు ఈ పేరు ఎంతో సుపరిచితం. గణాంక నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో కోల్‌కతలో ఏర్పాటైన ఈ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో నాలుగు క్యాంపస్‌ల(హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, తేజ్‌పూర్)కు విస్తరించింది. వీటిలో పలు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్‌లో ఆనర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు సమయంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా కేంద్ర గణాంక శాఖ, ప్రణాళిక విభాగం, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వీటితోపాటు పలు సర్వే ఏజెన్సీలు ఐఎస్‌ఐ విద్యార్థులకు తమ నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి.
భాషలో కెరీర్‌కు ఇఫ్లూ కోర్సులు లాంగ్వేజెస్‌లో లాంగ్‌టర్మ్ కెరీర్ కోరుకునే విద్యార్థులకు చక్కటి మార్గం.. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)- హైదరాబాద్ అందించే బ్యాచిలర్ డిగ్రీ కోర్సులే అనడంలో సందేహం లేదు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు మరో రెండు క్యాంపస్‌లు (షిల్లాంగ్, లక్నో) ద్వారా బ్యాచిలర్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు భారత్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలు, టూరిజం సంస్థలు, పురావస్తు శాఖ, పర్యాటక శాఖల్లో కొలువులు ఖాయం.
విదేశీ భాషల్లో విలువైన భవితకు జేఎన్‌యూ కోర్సులు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ లాంగ్వేజ్, లిటరేచర్, కల్చర్ స్టడీస్ పరిధిలో బ్యాచిలర్ స్థాయిలో పది విదేశీ భాషల్లో(అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్, పర్షియన్, పుస్తో, రష్యన్, స్పానిష్) బీఏ ఆనర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇంగ్లిష్ భాష నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో నెలకొల్పిన సెంటర్ ఫర్ ఇంగ్లిష్ స్టడీస్ పరిధిలో అందిస్తున్న బీఏ ఇంగ్లిష్ కోర్సుకు కూడా అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కూడా రాయబార కార్యాలయాలు, ఫార్మసీ సంస్థలు, టూరిస్ట్ సంస్థలు, ఆర్కియలాజికల్ సర్వే విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి.
న్యాయ నిపుణులుగా తీర్చిదిద్దే నల్సార్ కోర్సులు న్యాయ శాస్త్రంపై అభిరుచి, ఆ తర్వాత ఇదే రంగంలో స్థిరపడాలనుకునే ఔత్సాహికులకు సరైన వేదికలు కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన నేషనల్ లా యూనివర్సిటీలు. దేశ వ్యాప్తంగా పదహారు నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్‌లు ఉండగా.. వీటిలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా విభిన్నంగా ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఎల్‌ఎల్‌బీ కోర్సు అంటే బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సే సుపరిచితం. అయితే ఈ నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్‌లలోని కొన్నిటిలో బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్‌డబ్ల్యు ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ ఇలా విభిన్న కాంబిషేన్లతో కూడిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఈ కోర్సు లు పూర్తి చేసిన విద్యార్థులు న్యాయవాద వృత్తిలో స్థిరపడటమే కాకుండా.. పలు ఎంఎన్‌సీలు, బ్యాంకింగ్ సంస్థలు, కేపీఓలు, స్వచ్ఛంద సంస్థల్లో లీగల్ అడ్వైజర్లు, లీగల్ ఆఫీసర్లుగా కెరీర్ సొంతం చేసుకోవచ్చు.
చార్టర్డ్ అకౌంటెన్సీ.. కెరీర్ గ్యారెంటీ కెరీర్ గ్యారెంటీగా నిలుస్తున్న మరో కోర్సు.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ నిర్వహించే సీఏ. మొత్తం మూడు దశలుగా (సీపీటీ, ఐపీసీసీ, ఫైనల్) ఉండే ఈ కోర్సులో చేరేందుకు పదో తరగతి నుంచే సన్నద్ధం కావాలి. పదో తరగతి ఉత్తీర్ణత ఆధారంగా కోర్సు తొలి దశ సీపీటీ (కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్)కు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక సీపీటీ పరీక్షకు హాజరు కావాలి. ఈ సీపీటీ ప్రతి ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వంద గంటల ఐటీటీ కోర్సును పూర్తి చేసుకుంటే.. సీఏ కోర్సు రెండో దశ ఐపీసీసీలో పేరు నమోదు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. రెండు గ్రూపుల్లో ఉండే ఐపీసీసీని పూర్తి చేసుకుని నిర్ణీత వ్యవధిలో ఆర్టికల్‌షిప్ పూర్తి చేస్తే సీఏ ఫైనల్ పరీక్షలు రాసేందుకు అర్హత లభిస్తుంది. దీంతో చార్టర్డ్ అకౌంటెన్సీ విభాగంలో కెరీర్ ప్రారంభానికి మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో కేవలం ప్రాక్టీసింగ్ సీఏగానే కాకుండా.. పలు బహుళ జాతి సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థల్లో ఇంటర్నల్ ఆడిటర్, ఫైనాన్షియల్ ఆఫీసర్ వంటి హోదాలు సొంతం అవడం ఖాయం. వివరాలకు వెబ్‌సైట్: www.icai.org సీఎంఏ.. ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో ఉన్నత కెరీర్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో ఉజ్వల కెరీర్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్న మరో ప్రొఫెషనల్ కోర్సు.. కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ). ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్. ఫౌండేషన్ కోర్సుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా సీఎంఏ- ఇంటర్మీడియెట్ కోర్సుకు సీఎంఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అడుగుపెట్టొచ్చు. సీఎంఏ ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత సీఎంఏ ఫైనల్ కోర్సుకు అర్హత లభిస్తుంది. ఇది కూడా పూర్తయితే ఉత్పత్తి రంగంలోని పరిశ్రమలు, కోల్ ఇండియా, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, బీహెచ్‌ఈఎల్, పవర్ గ్రిడ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేట్ రంగంలోని సంస్థల్లోనూ అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ వంటి హోదాలతో ఉద్యోగం సొంతమవుతుంది. సీఎంఏలోని మూడు దశల కోర్సులకు ఏడాది ఆసాంతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏటా నాలుగుసార్లు జరిగే ఫౌండేషన్ పరీక్షలకు హాజరు కావాలంటే.. నమోదు చేసుకున్న తర్వాత నిర్ణీత వ్యవధి తప్పనిసరి. జూన్‌లో జరిగే పరీక్షకు జనవరి 31; సెప్టెంబర్‌లో నిర్వహించే పరీక్షకు ఏప్రిల్ 30; డిసెంబర్‌లో నిర్వహించే పరీక్షకు జూలై 31; మార్చిలో జరిగే పరీక్షకు అంతకుముందు సంవత్సరం అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి దశకు నిర్ణీత తేదీలను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.icmai.in కార్పొరేట్ కెరీర్ ‘సీఎస్ కార్పొరేట్ కెరీర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్న కోర్సు.. కంపెనీ సెక్రటరీ(సీఎస్). నిర్వహణ నైపుణ్యాలు, పరిశీలనాత్మక దృక్పథం, విశ్లేషణ సామర్థ్యం, టీం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు సరిపడే కోర్సు ఇది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించే సీఎస్ మూడు దశలుగా (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ఫైనల్) ఉంటుంది. ఫౌండేషన్ కోర్సులో పేరు నమోదుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత అర్హత. ఎగ్జిక్యూటివ్ దశకు నమోదు చేసుకోవాలంటే.. ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు బ్యాంకింగ్ రంగం, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థలు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలతోపాటు ప్రైవేట్ సంస్థల్లో కార్పొరేట్ కార్యకలాపాల విభాగంలోనూ విస్తృత అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా సొంతంగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. వివరాలకు వెబ్‌సైట్: www.icsi.edu
|
No comments:
Post a Comment