Sunday, April 26, 2015

కొలువులకు కేరాఫ్.. ఈ కోర్సులు!

బెస్ట్ జాబ్..బెటర్ ‘పే’..బ్రైట్ ఫ్యూచర్...విద్యార్థుల జీవిత లక్ష్యాలు.. ఇవే అనడం నిస్సందేహం.
Bavithaకళ్లముందు కోకొల్లలుగా కనిపిస్తున్న కోర్సులు.. అయితే, కొన్ని కోర్సులు మాత్రమే కొలువులకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి.. ఒక చేత్తో సర్టిఫికెట్.. మరో చేత్తో ఆఫర్ లెటర్ అందిస్తున్న కోర్సులివి.. జాబ్ మార్కెట్‌లో ఆ కోర్సులెంతో హాట్..10+2/ ఇంటర్ పరీక్షలు రాసి.. కెరీర్ అన్వేషణలో ఉన్న విద్యార్థుల కోసం..కచ్చితమైన కొలువులకు కేరాఫ్‌గా నిలుస్తున్న కోర్సులపై ప్రత్యేక విశ్లేషణ..

ఐఐఎస్‌టీ - బీటెక్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నెలకొల్పిన సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన ఈ ఇన్‌స్టిట్యూట్ బీటెక్ స్థాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సెన్సైస్ బ్రాంచ్‌లను అందిస్తోంది. వీటితోపాటు బీటెక్+ఎంటెక్/ఎస్ పేరుతో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తోంది.
  • అర్హత: ఇంటర్మీడియెట్ ఎంపీసీలో గ్రూప్ సబ్జెక్ట్‌లలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
  • ప్రవేశం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
  • దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.iist.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • 2015-16 విద్యా సంవత్సరానికి ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ విండో జూన్‌లో అందుబాటులోకి వస్తుంది.

కోర్సు పూర్తి చేస్తే కొలువు ఖాయం:
ఐఐఎస్‌టీ అందించే బీటెక్, బీటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇస్రో లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌లోని పలు విభాగాల్లో ఎంట్రీ లెవల్‌లో సైంటిస్ట్/ఇంజనీర్-ఎస్‌సీ హోదాలో ఉద్యోగం ఖాయం. అయితే విద్యార్థులు నాలుగేళ్ల కోర్సులో 7.5 సీజీపీఏ పొందడం తప్పనిసరి.
వివరాలకు వెబ్‌సైట్: www.iist.ac.in

యూపీఎస్‌సీ.. ఎస్‌సీఆర్‌ఏ
కేంద్ర ప్రభుత్వ కొలువు, బీటెక్ డిగ్రీ రెండిటికీ మార్గం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) నిర్వహించే స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్(ఎస్‌సీఆర్‌ఏ). ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నిర్ణీత వ్యవధిలో శిక్షణ లభించడంతోపాటు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - మెస్రా నుంచి బీటెక్ డిగ్రీ కూడా చేతికందుతుంది. కోర్సు నాలుగేళ్ల కాలంలో నెలకు 9వేలకు పైగా స్టైఫండ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి భారతీయ రైల్వేలో ఇంజనీరింగ్ విభాగంలో కొలువు ఖాయమవుతుంది. ఇలా కొలువు సొంతం చేసుకున్న విద్యార్థులకు ఇండియన్ రైల్వేస్‌లో ఏడాదిన్నర వ్యవధిలో ప్రొబేషనరీ ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. ప్రొబేషనరీ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే రైల్వేలో శాశ్వత ఉద్యోగం లభించినట్లే.
  • ఎస్‌సీఆర్‌ఏ అర్హత: 50శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ గ్రూప్‌లో అర్హత.
  • ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించే రెండు దశల ఎంపిక ప్రక్రియ (రాత పరీక్ష, ఇంటర్వ్యూ)లో ప్రతిభ ఆధారంగా.
  • నోటిఫికేషన్: సాధారణంగా ప్రతి ఏటా నవంబర్/ డిసెంబర్ నెలల్లో ఎస్‌సీఆర్‌ఏ నోటిఫికేషన్ వెలువడుతుంది.
  • వివరాలకు వెబ్‌సైట్: www.upsc.nic.in

ఐఐఎస్‌ఈఆర్.. బీఎస్-ఎంఎస్.. సైన్స్ రంగంలో కెరీర్
సైన్స్ రంగంలో కెరీర్ ఖాయం చేసుకోవాలనుకునే విద్యార్థులకు సరైన వేదికలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాంగణాలు. కోర్ సెన్సైస్‌లో ఔత్సాహికులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇన్‌స్టిట్యూట్‌లు దేశ వ్యాప్తంగా ఆరు (భోపాల్, కోల్‌కత, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి)ఉన్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న అయిదేళ్ల వ్యవధిలోని బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్, అణు శక్తి విభాగాలు తదితర విభాగాల్లో కొలువులు సులువవుతాయి.

ఇంటిగ్రేటెడ్ బీఎస్- ఎంఎస్ వివరాలు..
ఐదేళ్ల బీఎస్- ఎంఎస్ కోర్సులోకి వివిధ మార్గాల్లో ప్రవేశం కల్పిస్తారు.

ఎంపిక విధానం:

  • ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ ఆధారంగా.
  • జేఈఈకు హాజరు కాని విద్యార్థులు ఐఐఎస్‌ఈఆర్ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
  • కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఎస్‌ఏ స్ట్రీమ్‌కు అర్హత పొందిన విద్యార్థులు,
  • ఇన్‌‌సపైర్ ఫెలోషిప్ 2015కు అర్హత పొందిన విద్యార్థులు,
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు:

  • కేవైపీవై లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 27, 2015
  • ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఉత్తీర్ణత ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 4, 2015
  • ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: జూలై 12, 2015
  • వివరాలకు వెబ్‌సైట్: www.iiseradmission.in

గణాంక నైపుణ్యాలు.. కొలువులకు ఐఎస్‌ఐ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్.. ఉన్నత విద్య ఔత్సాహికులకు ముఖ్యంగా కామర్స్, స్టాటిస్టిక్స్ విద్యార్థులకు ఈ పేరు ఎంతో సుపరిచితం. గణాంక నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో కోల్‌కతలో ఏర్పాటైన ఈ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో నాలుగు క్యాంపస్‌ల(హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, తేజ్‌పూర్)కు విస్తరించింది. వీటిలో పలు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్‌లో ఆనర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు సమయంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా కేంద్ర గణాంక శాఖ, ప్రణాళిక విభాగం, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వీటితోపాటు పలు సర్వే ఏజెన్సీలు ఐఎస్‌ఐ విద్యార్థులకు తమ నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి.
  • అర్హత: మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత
  • ఎంపిక విధానం: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్షలో ర్యాంకు ఆధారంగా.
  • వివరాలకు వెబ్‌సైట్: www.isical.ac.in

భాషలో కెరీర్‌కు ఇఫ్లూ కోర్సులు
లాంగ్వేజెస్‌లో లాంగ్‌టర్మ్ కెరీర్ కోరుకునే విద్యార్థులకు చక్కటి మార్గం.. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)- హైదరాబాద్ అందించే బ్యాచిలర్ డిగ్రీ కోర్సులే అనడంలో సందేహం లేదు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు మరో రెండు క్యాంపస్‌లు (షిల్లాంగ్, లక్నో) ద్వారా బ్యాచిలర్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు భారత్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలు, టూరిజం సంస్థలు, పురావస్తు శాఖ, పర్యాటక శాఖల్లో కొలువులు ఖాయం.
  • కోర్సుల వివరాలు: ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్ భాషల్లో బీఏ ఆనర్స్ కోర్సు; బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్.
  • అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత
  • ఎంపిక విధానం: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
  • వివరాలకు వెబ్‌సైట్: www.efluniversity.ac.in

విదేశీ భాషల్లో విలువైన భవితకు జేఎన్‌యూ కోర్సులు
జవ
హర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ లాంగ్వేజ్, లిటరేచర్, కల్చర్ స్టడీస్ పరిధిలో బ్యాచిలర్ స్థాయిలో పది విదేశీ భాషల్లో(అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్, పర్షియన్, పుస్తో, రష్యన్, స్పానిష్) బీఏ ఆనర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇంగ్లిష్ భాష నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో నెలకొల్పిన సెంటర్ ఫర్ ఇంగ్లిష్ స్టడీస్ పరిధిలో అందిస్తున్న బీఏ ఇంగ్లిష్ కోర్సుకు కూడా అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కూడా రాయబార కార్యాలయాలు, ఫార్మసీ సంస్థలు, టూరిస్ట్ సంస్థలు, ఆర్కియలాజికల్ సర్వే విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి.
  • జేఎన్‌యూ బీఏ(ఫారెన్ లాంగ్వేజెస్) అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత
  • ఎంపిక విధానం: వర్సిటీ నిర్వహించే రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా
  • దరఖాస్తు విధానం: ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • వివరాలకు వెబ్‌సైట్: www.jnu.ac.in

న్యాయ నిపుణులుగా తీర్చిదిద్దే నల్సార్ కోర్సులు
న్యాయ శాస్త్రంపై అభిరుచి, ఆ తర్వాత ఇదే రంగంలో స్థిరపడాలనుకునే ఔత్సాహికులకు సరైన వేదికలు కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన నేషనల్ లా యూనివర్సిటీలు. దేశ వ్యాప్తంగా పదహారు నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్‌లు ఉండగా.. వీటిలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా విభిన్నంగా ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఎల్‌ఎల్‌బీ కోర్సు అంటే బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సే సుపరిచితం. అయితే ఈ నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్‌లలోని కొన్నిటిలో బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్‌డబ్ల్యు ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ ఇలా విభిన్న కాంబిషేన్లతో కూడిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఈ కోర్సు లు పూర్తి చేసిన విద్యార్థులు న్యాయవాద వృత్తిలో స్థిరపడటమే కాకుండా.. పలు ఎంఎన్‌సీలు, బ్యాంకింగ్ సంస్థలు, కేపీఓలు, స్వచ్ఛంద సంస్థల్లో లీగల్ అడ్వైజర్లు, లీగల్ ఆఫీసర్లుగా కెరీర్ సొంతం చేసుకోవచ్చు.
  • నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సుకు అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
  • ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ర్యాంకు ఆధారంగా.
  • క్లాట్-2015 నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 14, 2015.
  • వివరాలకు వెబ్‌సైట్: www.clat.ac.in

చార్టర్డ్ అకౌంటెన్సీ.. కెరీర్ గ్యారెంటీ
కెరీర్ గ్యారెంటీగా నిలుస్తున్న మరో కోర్సు.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ నిర్వహించే సీఏ. మొత్తం మూడు దశలుగా (సీపీటీ, ఐపీసీసీ, ఫైనల్) ఉండే ఈ కోర్సులో చేరేందుకు పదో తరగతి నుంచే సన్నద్ధం కావాలి. పదో తరగతి ఉత్తీర్ణత ఆధారంగా కోర్సు తొలి దశ సీపీటీ (కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్)కు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక సీపీటీ పరీక్షకు హాజరు కావాలి. ఈ సీపీటీ ప్రతి ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వంద గంటల ఐటీటీ కోర్సును పూర్తి చేసుకుంటే.. సీఏ కోర్సు రెండో దశ ఐపీసీసీలో పేరు నమోదు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. రెండు గ్రూపుల్లో ఉండే ఐపీసీసీని పూర్తి చేసుకుని నిర్ణీత వ్యవధిలో ఆర్టికల్‌షిప్ పూర్తి చేస్తే సీఏ ఫైనల్ పరీక్షలు రాసేందుకు అర్హత లభిస్తుంది. దీంతో చార్టర్డ్ అకౌంటెన్సీ విభాగంలో కెరీర్ ప్రారంభానికి మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో కేవలం ప్రాక్టీసింగ్ సీఏగానే కాకుండా.. పలు బహుళ జాతి సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థల్లో ఇంటర్నల్ ఆడిటర్, ఫైనాన్షియల్ ఆఫీసర్ వంటి హోదాలు సొంతం అవడం ఖాయం.
వివరాలకు వెబ్‌సైట్: www.icai.org

సీఎంఏ.. ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో ఉన్నత కెరీర్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో ఉజ్వల కెరీర్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్న మరో ప్రొఫెషనల్ కోర్సు.. కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ). ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్. ఫౌండేషన్ కోర్సుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా సీఎంఏ- ఇంటర్మీడియెట్ కోర్సుకు సీఎంఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అడుగుపెట్టొచ్చు. సీఎంఏ ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత సీఎంఏ ఫైనల్ కోర్సుకు అర్హత లభిస్తుంది. ఇది కూడా పూర్తయితే ఉత్పత్తి రంగంలోని పరిశ్రమలు, కోల్ ఇండియా, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, బీహెచ్‌ఈఎల్, పవర్ గ్రిడ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేట్ రంగంలోని సంస్థల్లోనూ అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ వంటి హోదాలతో ఉద్యోగం సొంతమవుతుంది. సీఎంఏలోని మూడు దశల కోర్సులకు ఏడాది ఆసాంతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏటా నాలుగుసార్లు జరిగే ఫౌండేషన్ పరీక్షలకు హాజరు కావాలంటే.. నమోదు చేసుకున్న తర్వాత నిర్ణీత వ్యవధి తప్పనిసరి. జూన్‌లో జరిగే పరీక్షకు జనవరి 31; సెప్టెంబర్‌లో నిర్వహించే పరీక్షకు ఏప్రిల్ 30; డిసెంబర్‌లో నిర్వహించే పరీక్షకు జూలై 31; మార్చిలో జరిగే పరీక్షకు అంతకుముందు సంవత్సరం అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి దశకు నిర్ణీత తేదీలను నిర్ణయించారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.icmai.in

కార్పొరేట్ కెరీర్ ‘సీఎస్
కార్పొరేట్ కెరీర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్న కోర్సు.. కంపెనీ సెక్రటరీ(సీఎస్). నిర్వహణ నైపుణ్యాలు, పరిశీలనాత్మక దృక్పథం, విశ్లేషణ సామర్థ్యం, టీం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు సరిపడే కోర్సు ఇది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించే సీఎస్ మూడు దశలుగా (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ఫైనల్) ఉంటుంది. ఫౌండేషన్ కోర్సులో పేరు నమోదుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత అర్హత. ఎగ్జిక్యూటివ్ దశకు నమోదు చేసుకోవాలంటే.. ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు బ్యాంకింగ్ రంగం, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థలు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలతోపాటు ప్రైవేట్ సంస్థల్లో కార్పొరేట్ కార్యకలాపాల విభాగంలోనూ విస్తృత అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా సొంతంగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
వివరాలకు వెబ్‌సైట్: www.icsi.edu

నూతనత్వం దిశగా న్యాయ శాస్త్రం
న్యాయ శాస్త్రంలో విద్యా బోధన, కోర్సులు ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్ లాస్ వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాకుండా కెరీర్ పరంగానూ కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం అని భావించే పరిస్థితి పోయింది. కార్పొరేట్ సంస్థలు సైతం న్యాయశాస్త్ర పట్టభద్రులకు కొలువులు ఆఫర్ చేస్తున్నాయి. నల్సార్‌లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ ఇందుకు నిదర్శనం. నేటి తరం విద్యార్థులు కాస్త విస్తృత దృష్టితో ఆలోచిస్తే ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, రిజిస్ట్రార్, నల్సార్ యూనివర్సిటీ


అభిప్రాయం మార్చుకుంటే అద్భుత అవకాశాలు
ఇంజనీరింగ్ లేదా మెడికల్ కోర్సులు చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయాన్ని విద్యార్థులు మార్చుకోవాలి. ఇప్పుడు లాంగ్వేజ్ కోర్సులకు సైతం ఎంతో డిమాండ్ ఉంది. ఇఫ్లూలోని పలు లాంగ్వేజ్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలు పొందిన వారెందరో! వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కు కూడా లాంగ్వేజ్ కోర్సులు పదోన్నతి దిశగా దోహదపడుతున్నాయి. అందుకే మేం అందిస్తున్న పార్ట్‌టైం కోర్సులకు పలువురు వర్కింగ్ ప్రొఫెషనల్స్ హాజరవుతున్నారు. ఇలా ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌డ్ రెండు కోణాల్లోనూ లాంగ్వేజ్ కోర్సులు ఇప్పుడు చక్కటి భవిష్యత్తుకు మార్గంగా నిలుస్తున్నాయి.
ప్రొఫెసర్ అలీ రజ్వా ముస్వి, రిజిస్ట్రార్, ఇఫ్లూ.


ఇంజనీరింగ్‌లోనూ విభిన్నంగా
నేటి తరం విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సు క్రేజీ ఆప్షన్ అనేది నిస్సందేహం. అయితే ఈ కోర్సు బ్రాంచ్‌లు, ఇన్‌స్టిట్యూట్‌లను ఎంపిక చేసుకునే విషయంలో కొంత ముందస్తు కసరత్తు చేస్తే ఇతరుల కంటే ముందంజలో నిలవడానికి ఆస్కారం ఉంటుంది. వినూత్న బ్రాంచ్‌లపై ఆసక్తి చూపాలి. అవి కచ్చితంగా మంచి హోదాను అందిస్తాయి. అంతేకాకుండా కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చే నైపుణ్యాలు అందిస్తాయి.
ప్రొఫెసర్ మువ్వా వెంకట రమణ, అసోసియేట్ ప్రొఫెసర్, ఐఐఎస్‌టీ

Jobs? Higher education?After graduating in many waysPG courses or professional coursesJobs in the public sector? Entarprenyursippa?Ticinga or job-oriented courses? Focus on the issues
Bavitha Higher Education PG'Science' Ascent:Vippenduku life on Mars Hill landmarks in cancer research that deals with the space trips .. .. Each of the modern world 'sambandhamunnade sainsto! Similar 'vijnanaranganlo + high niladokkukovalante career choice must be subject to post-graduation! Emessilo Mathematics, Physics, Chemistry, Botany, juvalajilu are the traditional subjects. There are many specializations offered are in accordance with the current job market. Osmania University, 2015-16, Forensic Science, Genetics, Microbiology, Nutrition and daititiks entries such as the announcement was made in the course of advanced specialization in the MSC. .. MSc Agricultural Biotechnology as well as the Andhra University, MSc Human Genetics, MSc in Marine Biology and Fisheries is providing such specialization. They receive opportunities to finish higher. The Research and Development (R & D) formed in the wake of preferred diardivo, access to research institutions such as the Baba Atomic Research Centre, involved with radical innovations.
Integrated Ph.D.To give the candidates the opportunity to graduate with a PhD qualification in science courses, integrated PhD courses emessitopatu. Bangalore, Indian Institute of Science (aiaiessi) .. Biological Sciences, Chemical Sciences, Mathematics, Physics departments providing integrated PhD courses. As well as the Jawaharlal Nehru Centre for Advanced Scientific Research Institute for Biological Sciences, Chemical Sciences will offer integrated PhD courses.
After bikam PG coursesBikam can complete the postgraduate level in various specializations enkam. .. They finance, accounting, taxation, international business, insurance, corporate sekratarisip, Marketing, Human Resource Management (hecarem). These include the finance, accounting spesalaijesansku is in demand. In view of the trend in the job market, some universities enkamlo Finance and Control, Corporate sekratarisip, Finance Management enkamnu offer innovative specialization.
Just fill in the banking, enbiephsi, other financial institutions in the Corporate Finance Manager, Internal Auditors over jobs. Corporate sekratarisip specialization enkam vaitkalar assistants completed the job of taking the company secretary. Corporate sekratarisip those who completed the company secretary (CS), in the course of exempt some papers. CS course so easily be completed in the future, more efficient tircididdukovaccu career.
After bikam elelbi (tax laws, company laws ..) and good opportunities to own corporate companies.
Master of Arts (MA)Master of Arts (MA) when History, Political Science, Public Administration specializations like the only thing to everyone. MA in modern specializations are currently available. As soon as it comes to employment. Job specialization is thus guaranteed. For example, Harvard University Master of Social Work (emesdablyu), Sociology, Psychology specialization, such as providing a master level.
Social Work, Sociology courses for those who completed the voluntary organizations, corporate organizations Corporate Social Responsibility (siesar) umntayi branches of the jobs available.
MBA, MCAAfter graduation he established a career in management in the cesukovalanukune the Master of Business Administration (MBA) can get. At the state level or at the national level for the purpose of the aiset CAT, MAT, simyat, as ekseti is scheduled exams.
Currently an MBA in Finance, Marketing, HR, along with traditional specialization, new subjects have been offered the job market demand. Examples of Retail Management, Hospitality Management, Insurance management say. Entrilevallo completion of the executive careers in related organizations.
MCA: If you are interested in technical education, the Master of Computer Applications (MCA) course can be selected. A good alternative ways to build a career in the software industry. This course also aiset entry (up to Intermediate Mathematics ensieku only candidates who are eligible) written, it must be a good rank.
Teacher educationBachelor's degree in teacher korsulloki entering the BEd (Bachelor of Education) to complete the course. The entry edset written, is teccukovalsi good rank. With regard to physical edyukesanku Bachelor of Physical Education (bipiidi) course is available. Telugu, Hindi, some of the special skills required to teach subjects such as language. The language courses are courses Pt. Language Pandit Common Entrance Test for admission to these (elpiset) apply.
Job Oriented CoursesSome of the students completed a bachelor's degree and job-oriented courses are also available. These courses completed over the course of the modern portfolio. Some of them .. fashion design, hospitality, hotel management, tourism, pharmaceuticals, biotechnology, bioinformatics, BSE, NSE to offer financial courses, corporate communication, event management, etc.. PG or PG Diploma in these areas, the diploma courses to choose short-term period.
Foreign languages ​​..For those with foreign language skills, employment opportunities around the world. Due to the rapid changes taking place in the wake of globalization in various sectors are good opportunities for those who know foreign languages. Particularly non-English speaking countries, there are good opportunities for those who know the language. .. In this context, French, German, Russian, Chinese languages ​​for those who know there is a demand. Osmania, iphlu, jeenyu Foreign Language courses of study offered by universities such as the Translator, intarpritetar, teaching, phrilansing departments sthirapadoccu employees.
'Lalo careerThe banking, insurance, taxation, telecom, information technology, real estate and other sectors, increased investment in the expansion of the traveling path. This has increased the need for justice departments. There are good opportunities for those who complete the courses in Law. Bachelor's degree, completed a three-year duration of the elelbi / biel can of course. Law Common Entrance Test for admission to law courses in the state (laset) apply. At the national level, the introduction of the Law of Common Law Admission Test (clot) will write.
Elelbi completed postgraduate courses in various specializations. Intellectual Property Rights, International Trade, Corporate Law, Patent Law, there are specializations like. By completing these multinational, corporate organizations, institutions, legal advayijarsga patent, legal managers start their career.
Jobs laksyamaiteUPSC, SSC, RRB, the Public Service Commissions of different jobs, from time to time in relation to the notifications are to be released. Kanabaracalante academic performance in the current fierce competition testing programs have to keep on the competitive examinations. The latest information on a regular basis in the form of notes to make. The question to consider in relation to their exams. The Internet, through the media, such as magazines ksunnanga understanding of the information related to the exam. Past winners, experts engaged in the prescribed standard material preparedness. Coaching will also be necessary. Anubhavanike jobs in the private sector, they pradhanyamivvali target. Certain employees' use of opportunities to become a vecicusi it down .. .. do not waste time. The experience obtained. The higher the chances that the goal of the field. This in order to keep the job opportunities in the field of higher education.
JobsYupiessi sivils, sidiesSSC Combined Graduate-Level, Tax Assistant, Section Officer (Audit, Accounts, Commercial Audit)Esessi Central Armed Forces, SIRailway-eesem, gudsgard, supervisor, commercial clerk cum reservation clerk InquiryBanks - Clerk, pivo, Management TraineeLIC - dio, eevo, someFood Corporation of India recruitment tests
At the state levelState Public Service Commissions at the state level from a Group 1, Group 2, Group 4, divisional Accounts Officers and other tests to wrest talent employed by the government.
The increasing importance of all the categoriesThe students completed a bachelor's degree in higher education sweet post-graduation (PG). The postgraduate courses now growing in importance all spesalaijesanlaku. The Science, Mathematics are likely in the future, the views of those who are not now. Arts and humanities courses completed abhyarthulaku employment opportunities are available. Arts students emotionally, however, to change their attitude. Arts gruplante just thought of a way of testing the government's employment and other opportunities to keep pace with the competition. Higher education is better in terms of career ranincalante current competitive conditions. PhD students in science courses toward a long-term plan to optimize the thinking from now on.Professor ch gopalreddi, Admissions Director, Osmania University.

Higher education opportunities to highThe current competitive world of higher education courses as either high risk by practicing over. PG degree of specialization is more useful for the selection to be innovative. Currently all the universities within the postgraduate level, with new specializations are available. Increase awareness among students. Basic spesalaijesanske limited focus on inter-disciplinary specializations. Arts, Commerce, Science faculty of the new courses are coming up with all this .. it would employ in the future. By so doing postgraduate students to achieve their career in terms of the realization of the domain of the subjects at the forefront of the competition will have the chance to finish.Professor oanil Kumar, Admissions Director, Andhra University.

ఉద్యోగమా? ఉన్నత విద్యా?

డిగ్రీ తర్వాత పలు మార్గాలు
పీజీ కోర్సులు లేదా ప్రొఫెషనల్ కోర్సులు
ప్రభుత్వ రంగ ఉద్యోగమా? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్పా?
టీచింగా లేదా జాబ్ ఓరియంటెడ్ కోర్సులా? వంటి అంశాలపై ఫోకస్

Bavitha ఉన్నత విద్య- పీజీ
‘విజ్ఞానం’ ఉన్నతం:
క్యాన్సర్‌పై పరిశోధనలైనా.. అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల గుట్టు విప్పేందుకు చేపట్టే అంతరిక్ష యాత్రలైనా.. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కటీ ‘సైన్స్’తో సంబంధమున్నదే! ఇలాంటి ‘విజ్ఞాన’రంగంలో+ ఉన్నత కెరీర్‌లో నిలదొక్కుకోవాలంటే నచ్చిన సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాల్సిందే! ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలు సంప్రదాయ సబ్జెక్టులుగా ఉన్నాయి. వీటికి దీటుగా ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2015-16లో ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ వంటి అధునాత స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్, ఎంఎస్సీ మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ వంటి స్పెషలైజేషన్లను అందిస్తోంది. వీటిని పూర్తిచేసి ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు. దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ)కి ప్రాధాన్యం ఏర్పడిన నేపథ్యంలో డీఆర్‌డీవో, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి పరిశోధన సంస్థల్లో ప్రవేశించి, నవ్య ఆవిష్కరణల్లో పాలుపంచుకోవచ్చు.

ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
సైన్స్ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పించే కోర్సులు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ).. బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. అదే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది.

బీకామ్ తర్వాత పీజీ కోర్సులు
బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్‌తో ఎంకామ్ పూర్తి చేయవచ్చు. అవి.. ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్, కార్పొరేట్ సెక్రటరీషిప్, మార్కెటింగ్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్‌ఎం). వీటిలో ప్రస్తుతం ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని యూనివర్సిటీలు ఎంకామ్‌లో ఫైనాన్స్ అండ్ కంట్రోల్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ వంటి వినూత్న స్పెషలైజేషన్లలో ఎంకామ్‌ను అందిస్తున్నాయి.

వీటిని పూర్తిచేస్తే బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ, ఇతర ఆర్థిక సంబంధిత కార్పొరేట్ సంస్థల్లో ఫైనాన్స్ మేనేజర్లుగా, ఇంటర్నల్ ఆడిటర్స్‌గా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ స్పెషలైజేషన్‌లో ఎంకామ్ పూర్తిచేసిన వారు కంపెనీ సెక్రటరీకి సహాయకులుగా వైట్‌కాలర్ జాబ్‌ను చేజిక్కించుకోవచ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ పూర్తిచేసిన వారికి కంపెనీ సెక్రటరీ (సీఎస్) కోర్సులో కొన్ని పేపర్లలో మినహాయింపు లభిస్తుంది. అందువల్ల భవిష్యత్తులో తేలిగ్గా సీఎస్ కోర్సును పూర్తిచేసి, కెరీర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు.

బీకామ్ తర్వాత ఎల్‌ఎల్‌బీ (ట్యాక్స్ లాస్, కంపెనీ లాస్..) చేసి, కార్పొరేట్ కంపెనీల్లో మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.

మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ)
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) అనగానే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ు వంటి స్పెషలైజేషన్లు అందరికీ గుర్తొస్తాయి. అయితే ప్రస్తుతం ఎంఏలోనూ ఆధునిక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసిన వెంటనే ఉపాధి లభిస్తుంది. అందుకే వీటిని జాబ్ గ్యారంటీ స్పెషలైజేషన్లుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ), సోషియాలజీ, సైకాలజీ వంటి స్పెషలైజేషన్లను మాస్టర్ స్థాయిలో అందిస్తోంది.

సోషల్ వర్క్, సోషియాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంంటాయి.

ఎంబీఏ, ఎంసీఏ
గ్రాడ్యుయేషన్ తర్వాత మేనేజ్‌మెంట్ విభాగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ను చేయొచ్చు. దీనికోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఐసెట్ లేదా జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్‌ఏటీ వంటి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఎంబీఏలో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతో పాటు జాబ్ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్జెక్టులు అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఉదాహరణలుగా రిటైల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్‌ను చెప్పొచ్చు. వీటిని పూర్తిచేస్తే సంబంధిత సంస్థల్లో ఎంట్రీలెవల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.

ఎంసీఏ: సాంకేతిక విద్య వైపు ఆసక్తి ఉంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ రంగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకునేందుకు చక్కటి ప్రత్యామ్నాయ మార్గమిది. ఈ కోర్సులో ప్రవేశానికి కూడా ఐసెట్ (ఇంటర్మీడియెట్ వరకు మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థులు మాత్రమే ఎంసీఏకు అర్హులు) రాసి, మంచి ర్యాంకు తెచ్చుకోవాలి.

ఉపాధ్యాయ విద్య
బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ కోర్సుల్లోకి ప్రవేశించాలంటే బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు పూర్తిచేయాలి. ఇందులో ప్రవేశాలకు ఎడ్‌సెట్ రాసి, మంచి ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. వీటికి ఉద్దేశించిన కోర్సులు లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిలో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎల్‌పీసెట్) రాయాలి.

జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు
బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు కొన్ని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసి, ఆధునిక కొలువులను సొంతం చేసుకోవచ్చు. వీటిలో కొన్ని.. ఫ్యాషన్ డిజైనింగ్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం, ఫార్మా, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ కోర్సులు, కార్పొరేట్ కమ్యూనికేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తదితరాలు. ఈ విభాగాలకు సంబంధించి పీజీ లేదా పీజీ డిప్లొమా, స్వల్ప కాలిక వ్యవధితో ఉండే డిప్లొమా కోర్సులను ఎంచుకోవచ్చు.

విదేశీ భాషలు..
విదేశీ భాషల్లో నైపుణ్యాలు ఉన్నవారికి ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలుంటాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ రంగాల్లో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఫారెన్ లాంగ్వేజ్‌లు తెలిసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్ భాషలు తెలిసిన వారికి డిమాండ్ ఉంది. ఉస్మానియా, ఇఫ్లూ, జేఎన్‌యూ వంటి యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రిటేటర్, టీచింగ్, ఫ్రీలాన్సింగ్ విభాగాల్లో ఉద్యోగులుగా స్థిరపడొచ్చు.

‘లా’లో కెరీర్
దేశంలో బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో ఇవి విస్తరణ పథంలో పయనిస్తున్నాయి. ఈ విభాగాల్లో న్యాయసేవల అవసరం పెరిగింది. దీంతో లా కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు చేయొచ్చు. రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయాలి. జాతీయ స్థాయి లా కళాశాలల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది.

ఎల్‌ఎల్‌బీ పూర్తయ్యాక వివిధ స్పెషలైజేషన్లలో పీజీ కోర్సులు ఉన్నాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, కార్పొరేట్ లా, పేటెంట్ లా వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా బహుళజాతి, కార్పొరేట్ సంస్థల్లో, పేటెంట్ సంస్థల్లో లీగల్ అడ్వయిజర్స్‌గా, లీగల్ మేనేజర్స్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.

ఉద్యోగమే లక్ష్యమైతే
యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. ప్రస్తుత తీవ్ర పోటీ వాతావరణంలో ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలంటే అకడమిక్ కోర్సులు చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధంకావాలి. రోజూ తాజా సమాచారాన్ని నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. ఆయా పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఇంటర్నెట్, పత్రికలు వంటి మాధ్యమాల ద్వారా సంబంధిత పరీక్షల సమాచారాన్ని క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. గత విజేతలు, నిపుణులు సూచించిన ప్రామాణిక మెటీరియల్‌తో సన్నద్ధతను సాగించాలి. అవసరమైతే కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు అనుభవానికే ప్రాధాన్యమివ్వాలి. ఫలానా ఉద్యోగమే’ కావాలని వేచిచూసి.. సమయం వృథా చేసుకోకుండా.. అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. అనుభవం సంపాదించాలి. తద్వారా ఆ రంగంలో ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలి. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే సంబంధిత రంగంలో ఉన్నత విద్య అవకాశాలను అన్వేషించాలి.

ఉద్యోగాలు
యూపీఎస్సీ-
సివిల్స్, సీడీఎస్
ఎస్‌ఎస్‌సీ-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ట్యాక్స్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్(ఆడిట్, అకౌంట్స్, కమర్షియల్ ఆడిట్)
ఎస్‌ఎస్‌సీ- సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఎస్‌ఐలు
రైల్వే-ఏఎస్‌ఎం, గూడ్స్‌గార్డ్, సూపర్‌వైజర్, కమర్షియల్ క్లర్క్, రిజర్వేషన్ కం ఎంక్వైరీ క్లర్క్
బ్యాంకులు - క్లర్క్, పీవో, మేనేజ్‌మెంట్ ట్రైనీ
ఎల్‌ఐసీ - డీఓ, ఏఏవో, ఏవో
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియామక పరీక్షలు

రాష్ట్ర స్థాయిలో
రాష్ట్ర స్థాయిలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వెలువరించే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ తదితర పరీక్షల్లో ప్రతిభ ద్వారా ప్రభుత్వ కొలువును దక్కించుకోవచ్చు.

అన్ని విభాగాలకూ పెరుగుతున్న ప్రాధాన్యం
బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా గుర్తొచ్చేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ). ఇప్పుడు ఈ పీజీ కోర్సుల్లో అన్ని స్పెషలైజేషన్లకూ ప్రాధాన్యం పెరుగుతోంది. కేవలం సైన్స్, మ్యాథ్స్ చేసిన వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయాలు ఇప్పుడు లేవు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అయితే ఆర్ట్స్ విద్యార్థులు మానసికంగా తమ దృక్పథం మార్చుకోవాలి. ఆర్ట్స్ గ్రూప్‌లంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మార్గంగానే భావించకుండా ఇతర అవకాశాలపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో కెరీర్ పరంగా రాణించాలంటే ఉన్నత విద్యను అభ్యసించడం మేలు. సైన్స్ విద్యార్థులు దీర్ఘకాలిక ప్రణాళికతో పీహెచ్‌డీ కోర్సుల వైపు కూడా ఇప్పటి నుంచే ఆలోచించడం అభిలషణీయం.
ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్‌రెడ్డి, అడ్మిషన్స్ డెరైక్టర్, ఉస్మానియా యూనివర్సిటీ.


ఉన్నత విద్యతో సమున్నత అవకాశాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పీజీ వంటి ఉన్నత విద్య కోర్సులు అభ్యసించడం ద్వారా సమున్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. పీజీ స్థాయిలో స్పెషలైజేషన్ల ఎంపికలో వినూత్నంగా వ్యవహరించడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని యూనివర్సిటీల పరిధిలో పీజీ స్థాయిలో కొత్త కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. విద్యార్థులు వీటిపై అవగాహన పెంచుకోవాలి. బేసిక్ స్పెషలైజేషన్స్‌కే పరిమితం కాకుండా ఇంటర్ డిసిప్లినరీ స్పెషలైజేషన్లు దిశగా దృష్టి పెట్టాలి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఇలా అన్ని ఫ్యాకల్టీల్లో కొత్త కోర్సులు వస్తున్నాయి.. ఇవి భవిష్యత్తులో కొలువులను ఖాయం చేస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు పీజీ చేయడం ద్వారా తమ డొమైన్ సబ్జెక్ట్‌లలో పరిపూర్ణత సాధించి కెరీర్ పరంగా పోటీలో ముందంజలో నిలవడానికి ఆస్కారం లభిస్తుంది.
ప్రొఫెసర్ ఒ.అనిల్ కుమార్, అడ్మిషన్స్ డెరైక్టర్, ఆంధ్రా యూనివర్సిటీ.
Dhanyanamuttamam daksyam
              
Our scientific power has outrun our spiritual power. We have guided missiles but misguided men .... The words of Martin lutharking Bringing challenges reflect a rapidly developing science. Punahsrstincukune in accordance with the conditions and capabilities of their own power to bind the bhodincekanna evarikivarini vislesistonna that triggered the best way to evi Aish article ....
Pudutune Negro slave, was born in a poor family in the United States. Lost his father in infancy. He, his mother and his mother sold to traders trying to sell as slaves. But he was ill at the hard cast left a fruit garden. The money was ironing clothes .. botanical madhinci spare time almost all types of plants, 300 kinds of diseases melakuvalatone invented a biological drugs. His discipline, dedication, intelligence, offered a million dollars by the year, Thomas Alva Edison asked to work with him. But his college, his education, research results, so that everyone pancutanani the lowest cost American agriculture to become more productive in the country, had wanted to believe. "I tayarucesindanta God has given me. How to do it for someone else's profit ammagalanu 'anevadayana. For millions of farmers across the country, providing them with the essence of his research, helped to ensure that their crops are safe forever.
There he wrote after his death samadhimida.
"He could have added fortune to fame, but caring for neither he found happiness and honour in being helpful to the World ''
'' If there had kirtitopatu wealth, but also defied both his happiness, respect, felt that the world is sayapadadanlone '' He is the George Washington Carver. Who runs a small royalty for the patent is that the patent for the days of taking a non-selfish tanadesa farmers adarsaniyam padikalalapatu cool to have all of his quest. Carver Research Foundation was set up by the amount of his salary savings. Even after his death in society, how udattamainavo upayogapadalane shows his ambitions.
Vasudha anganavedi canal jaladhi: sthavica patalamValmika: World Sumer: krtapratijnanasya dhirasya
For those determined to land for Philanthropy mandalamanta small gardens, the sea in a small canal, into the abyss, like a promenade, a little like when Meru mountain. Avarodhaloccina automatically removes many such heroes. Tolagincukogalaru otherwise. Bandhumitrulandariki meal to be his brother's wedding ... in the country (after India's independence), due to food shortages, according to the rule of the people to know that just 30 people ... We are moving towards self-sufficiency in agriculture roasting decided to land anyway. .. Green revolution in India by reaching aipiesku selection of fried MS are moving towards self-reliance. Swaminathan inspirational travel dikcuce student.
Satamatam since childhood, despite the problems, the challenges with confidence, pushing them to become successful in this mahanubhavulu thousand sakulunna .. ambivalent languishing in a decisive stage and no matter whether the student was told by someone else, someone else took, someone else owns the well sampadistunnarani tamaku ambiguous attitude to take incorrect decisions, ideal for all those who are contributing to the klesa them.
That is more than just reading textbook reading apperceive corporeal sensitivity, fiddle-vadoduga being parents. Early childhood education drawback is that it is able to think things out of the house.
Family walk, how kharcuvutondi his education? Family income? Coming from nowhere? Based on their understanding of the students, including food, makeup, habits, pleasures, increased attention to frugal tastes. Caduvupatla read more commitment to fiscal discipline and raise the formation of the gauravabhavanni will have enhanced rather than the parent. Among the family members it is a healthy, democratic dialogue pempondimpacesi understand each other, to live in one of the pleasant atmosphere of the house is okarikosam. Alavarustundi realistic view of life that can occur in life.
Instead of reading anvayincukuntu education for life, sense of watching a real-life proceed forward. Read this increasingly visayasekaranapai as they read the books, the issue is likely to be an integral part of the students it will hold up. Parties which students, parents and teachers all walk together to discuss and move forward. Do not apply to life, education, read understood the basic problems of life remain the same. Rice, curry, ghee, which included an equal mix tastier eating habit that can be used to teach life. All together, is guilty of the same, and it is easy to eat, but not to make a paste. Pathyapustakalatopatu society were also able to study the tayaraitene Intelligence quotient, Emotional quotient, Social quotient, Spiritual quotient, combined with an equal mix of all that is man.
Parents are asked to read mechanical engineering at IIT Madras Madhavan agriculture cestananna "I want to transform what I study in to what I love '' anukunipanicesi hiding the money to buy six acres .. early damage done to agriculture. However, Israel drip irrigation system pattuvidavakunda (750 liters per liter of water is sufficient to require at) adopted agriculture profitable one.
Agricultural universities, agricultural loans, to take practical experiments ceppekante wrong. Assigned to work on his farm for 10 cents per acre. One hour worked in the United States, serving meals throughout the day can not come here to earn three meals. You need to change it. Madhavan, otherwise known as food insecurity pramadakaramaindi than the atom bomb. He added that many of the country's engineers used their engineering knowledge in the field of their choice entamunduku tisukuvellavacco heart? Former President APJ Abdul Kalam visited the farm abburapadi Madhavan Madhavan, we deliberately million.
Do not look for them in the life of us all. To find ourselves. There are many lessons we can learn the turns of each passage. Got up at four in the morning, and paper, and read in the bath for two days and then reading the desired outcome of the studies did not receive the scholarship, studentship emaitilo nilipivestananna provided by the teacher Abdul Kalam said that the outcome of those words. As long as this event is to the value of the specified time to complete a task, rather than a healthy stress, the need and aspiration manasuninda nerpindantaru Kalam content. Moreover, not only the owner of pratimanisi workers also learned that he jivitapatham paniceyagaliginapude antarayana successful outcomes. What does a teacher scholarship apestanani learn these lessons?
Calo vinodena kavyasastra gacchati dhimatamVyasanenaca murkhanam nidraya kalahenaca
Svanubhavanto to achieve excellence in the study of scientific phenomena buddhimantudu.Foolish addictions, sleep, strife velladistaru period.
Goppavarini see, when they heard about the reputation of their bagundunanipistundi us. In an extreme case, however, when the outstanding issues without losing manonibbaram wisdom, patience, sensitivity, responsive way they varinadaka using common sense, manners, rather than telling us the skills to master the things we will remember.
College tuitions for higher education, saying that kontasthayiki own strength to grow with the help of the Mysore court in civil engineering prathamasthananni won their first job .. sukkuru sindhunadi water and brought to the town where the people worked Visveswaraya moksagundam dahartini often painted his own image. And why deny it Mahanadi runoff from the dam gates have been made to use the automatic sluyij. Hyderabad Hyderabad, the chief engineer at the Musée vilavilaladina flood dams, trams, parks and tied securely, whereby sundaranganu. Krsnarajasagar dam was built in Karnataka million acres. Aimaisuru divanuga dessert called bandhuvulandarini hired him, through his office, at their word that they would take no svalabhalanu asincanantene the post of prime minister to take. But when what is required is a relative paid his salary. In his words,
"To give real service you must add something which can not be bought or measured with money '''' With the money konalenidi, velakattalenidi any jodincagaligitene we really sevacesinatlu ''
As beggars because of his birthday, September 15, celebrated injanirsa dega. He can learn from the master of life, many leadership lessons for those who are modest.
Abhivadasya silasya regular vrddho pasevina:Catvari tasya vardhanta life: the strength of the intelligence yaso
Whoever is correct, mahanubhavula about humility, devotion of their longevity, wisdom, fame, develop strength.
The selected students wrote a letter to a leading company in campus placement.'' Many of you doing a full degree, first job, is proud to be a lot of cerutunnanduku. Looking to the next payroll, positions are discussing. But we have looked at, Delaware sent to you with your quality, your skill, your productivity, your credibility to the concern of how writing notes. But you can not in your generation, your next generation also reduces the quality of learning nercukovalsinavi vestayane writing anxiety.
You speaks fluent English, was written by written bayodetalo. But more than half of the English bayodetallo tadakalu errors. Or the skill required to work in the world? Think?
There could be plenty of problem-solving skills. As previously wrote the same to your seniors. When cool the solution to a problem when thinking about what will soon be asked to do. Misthayi you to resolve the problem of how confident you are able to work in your organization? Ippatinuncaina would expect this habit?
Nercukuntamani new skills to meet changing conditions made the task of giving the word. Learning how to drop after joining duty. Ivadam meruguparacukokunda skills to be a better salary?
Todpatamani progress towards full adherence to the company, the company said. But the possibility of a better salary istanante as soon as someone leaves the company. We badhapadataro you how much you need to send them out of the ardhantaranga the time you left the company, how the company considered begun? Believe that your loyalty?
If you think you have a personal need anakudadani nothing wrong when it came to office late. But the company needed an intuitive and you expect to contribute to solving the problem of the greedy?
Beginning-end of your career is in your hands. One possible skill you have, you can increase the capacity, your family, your sansthaku country, to become a renewable asset - our desire to be a responsible company. Language skills, knowledge craving, svavivekam, share value, Professionalism - and your growth, your through the steps of our development / foundations.
To re honest, expect to share in the goodwill of the permanent understand and support the organization?
This letter is a case of something that applies to all of us. What is the professionalism that they mentioned?Mahadeva is not the father of the little boy of five and a working on something that took his mother ... Ill of the dead have been orphaned by his mother's funeral ... none of those who thought they would not believe that anyone in his tallilanti sastroktanga he would be cremated. YetAlmost 45 thousand people had so assiduously to the funeral. It is not yet. The bodies have not asked for anything, he threw into the river. But he sure that there is no monitoring of the process would be complete dedication to the task. To do our work, we pay 10 times more ceppincukuni, superintendent of the swearing eat, the professionalism that we have fears that bird? Or? Questioned, without the full commitment monitoring Mahadeva have cesepanilo professionalism?
ధాన్యానాముత్తమం దాక్ష్యం

         

Our scientific power has outrun our spiritual power. We have guided missiles but misguided men .... అన్న మార్టిన్ లూథర్‌కింగ్ మాటలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్రసాంకేతిక రంగాలు తీసుకువస్తున్న సవాళ్లకు దర్పణం. ఈ పరిస్థితుల్లో బంధించి భోదించేకన్నా ఎవరికివారిని తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పునఃసృష్టించుకునే దిశగా ప్రేరేపించటమే ఉత్తమ మార్గం అని విశ్లేషిస్తోన్న ఎ.వి. రాజమౌళి వ్యాసం....

అమెరికాలోని ఒక నిరుపేద నీగ్రో కుటుంబంలో పుడుతూనే బానిసగా జన్మించాడు. తండ్రిని బాల్యంలోనే కోల్పోయాడు. తనను, తన తల్లిని బానిసలుగా అమ్మడానికి ప్రయత్నించిన వర్తకులు తల్లిని అమ్మేశారు. కానీ జబ్బుపడ్డ అతడిని కష్టపడటానికి పనికిరాడని ఒక పండ్ల తోట వద్ద వదిలి వెళ్లిపోయారు. ఖాళీ సమయాల్లో బట్టలు ఇస్త్రీ చేయగా వచ్చిన డబ్బుతో.. వృక్షశాస్త్రాన్ని మధించి దాదాపు మొక్కలకు వచ్చే అన్ని రకాల వ్యాధులకు 300 రకాల మందులను వృక్షశాస్త్ర మెళకువలతోనే కనిపెట్టాడు. అతని క్రమశిక్షణ, అంకితభావం, మేధస్సు చూసి సంవత్సరానికి లక్ష డాలర్లు ఇస్తానని, తనతో కలిసి పని చేయాలని కోరాడు థామస్ ఆల్వా ఎడిసన్. కానీ తన కాలేజీలోనే తన విద్యను, పరిశోధనల ఫలితాలను అందరికీ పంచుతాననీ తద్వారా అమెరికా వ్యవసాయరంగం అతి తక్కువ ఖర్చులో ఎక్కువ ఉత్పాదకత గల దేశంగా అవతరించగలదని నమ్మి అనుకున్నది సాధించాడు. ‘నేను తయారుచేసిందంతా భగవంతుడు నాకు ఇచ్చింది. దాన్ని వేరొకరి లాభం కోసం ఎలా అమ్మగలను’ అనేవాడాయన. దేశమంతా లక్షలాది రైతులకు ఉచితంగా తన పరిశోధనల సారాన్ని అందించి వారిని, వారి పంటలను ఎప్పటికీ సురక్షితంగా ఉండేలా తోడ్పడ్డాడు.

ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధిమీద ఇలా రాసి ఉంది.

"He could have added fortune to fame, but caring for neither he found happiness and honour in being helpful to the World''

‘‘కావాలనుకుంటే కీర్తితోపాటు సంపద కూడా వచ్చేది కానీ రెంటినీ లెక్కచేయక తన ఆనందం, గౌరవం ప్రపంచానికి సాయపడడంలోనే ఉంది అని భావించాడు’’ ఆయనే జార్జి వాషింగ్టన్ కార్వర్
. చిన్న విషయాన్ని కనిపెట్టినా పేటెంటు కోసం పరుగులు పెట్టి రాయల్టీ కోసం రాద్ధాంతం చేసే రోజుల్లో ఒక్క పేటెంటు తీసుకోకుండా లాభాపేక్ష లేకుండా తనదేశ రైతులు పదికాలాలపాటు చల్లగా ఉండాలన్న అతని తపన అందరికి ఆదర్శనీయం. తన జీతంలో పొదుపు చేసిన మొత్తంతో కార్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇలా తను మరణించిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలనే అతని ఆశయాలు ఎంత ఉదాత్తమైనవో అర్థమవుతుంది.

అంగణవేదీ వసుధా కుల్యా జలధి: స్థవీచ పాతాళమ్
వాల్మీక: చ సుమేరు: కృతప్రతిజ్ఞానస్య ధీరస్య

పరోపకారం కోసం కృతనిశ్చయంతో ఉన్నవారికి భూ మండలమంతా చిన్న తోటలా, సముద్రం ఒక చిన్న కాల్వలా, పాతాళం ఒక విహార ప్రదేశం లాగా, మేరు పర్వతం ఒక చిన్న పుట్టలా కనిపిస్తుంది. అటువంటి వీరులకు ఎన్ని అవరోధాలొచ్చినా వాటికవే తొలగిపోతాయి. లేకపోతే తొలగించుకోగలరు. తన సోదరుని వివాహానికి బంధుమిత్రులందరికీ భోజనం పెట్టాలనుకున్నా... దేశంలో (భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత) ఆహార కొరత వల్ల, అప్పుడున్న నియమం ప్రకారం కేవలం 30 మందికి మాత్రమే పెట్టాలని తెలిసి... ఎలాగైనా దేశాన్ని వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయించాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎస్‌కు ఎంపికైనా చేరకుండా.. హరితవిప్లవం ద్వారా భారతదేశాన్ని స్వావలంబన దిశగా అడుగులు వేయించిన ఎం.ఎస్. స్వామినాథన్ స్ఫూర్తిదాయక ప్రయాణం విద్యార్థులందరికీ దిక్చూచే.

బాల్యం నుంచీ సమస్యలు సతమతం చేసినా, ధైర్యంగా ఎదుర్కొని, వాటిని అధిగమించి విఫలమవడానికి వేయి సాకులున్నా సఫలమైన ఈ మహానుభావులు.. విద్యార్థి దశలో నిర్ణయాత్మక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరో చెప్పారని, మరెవరో తీసుకున్నారని, వేరెవరో బాగా సంపాదిస్తున్నారనీ అస్పష్ట వైఖరితో అసమంజస నిర్ణయాలు తీసుకుని తమకూ, తమ వారికీ క్లేశ కారణమవుతున్న వారందరికీ ఆదర్శమే.

చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకం పఠనమే కాక మానవసంబంధాల సున్నితత్వాన్ని అర్థంచేసుకుని చదువుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు-వాదోడుగా ఉండటమే. ఇంటి పనులు చేసుకోవడం చిన్నతనంగా భావిస్తే అది విద్యాభ్యాసంలో లోపమే.

కుటుంబం నడవడానికి, తన చదువుకు ఎంత ఖర్చువుతోంది? కుటుంబ ఆదాయం ఎంత? ఎక్కడి నుంచి వస్తోంది? తదితర అంశాలు విద్యార్థులు అర్థం చేసుకొంటే వారి ఆహారం, ఆహార్యం, అలవాట్లలో, ఆనందాలలో, అభిరుచులలో మితవ్యయం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇలా ఏర్పడే ఆర్థిక క్రమశిక్షణ చదివే చదువుపట్ల మరింత అంకితభావం పెంచడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల గౌరవభావాన్ని ఇనుమడింప చేస్తుంది. అది కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకర, ప్రజాస్వామ్యబద్ధమైన సంభాషణ పెంపొందింపచేసి ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికోసం ఒకరు జీవించే ఆహ్లాదకర వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. ఇలా ఏర్పడే జీవితానుభవం జీవితంపట్ల వాస్తవిక దృక్పధాన్ని అలవరుస్తుంది.

అలాకాకుండా చదివిన చదువును జీవితానికి అన్వయించుకుంటూ, అర్థవంతంగా నిజజీవితంలో గమనిస్తూ ముందుకు సాగాలి. ఇలా చదువు పెరిగే కొద్దీ, చదవాల్సిన పుస్తకాలు పెరిగే కొద్దీ విషయసేకరణపై, విషయంపై పట్టు పెరిగి అది విద్యార్థిలో అంతర్భాగం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇది జరగాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చర్చించి ముందుకు కలిసి నడవాలి. లేకపోతే జీవితానికి అన్వయించని చదువు, చదివినా అర్థంకాని జీవితం ఇవే ప్రాథమిక సమస్యలుగా మిగిలిపోతాయి. అన్నం, కూర, నెయ్యి కలుపుకుని సమపాళ్లలో రుచిగా భుజించడం నేర్పిస్తే జీవితాంతం ఆ అలవాటు ఉపయోగపడుతుంది. అదే అన్నీ కలిపి ముద్దలుగా చేసి పెడితే తినడం సులభమే కానీ, ముద్ద తయారు చేయడం రాదు. పాఠ్యపుస్తకాలతోపాటు సమాజాన్ని కూడా అధ్యయనం చేయగలిగే వారుగా తయారైతేనే Intelligence quotient, Emotional quotient, Social quotient, Spiritual quotient అన్నీ సమపాళ్లలో కలిసిన వ్యక్తిగా రూపొందుతారు.

ఐఐటీ మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వ్యవసాయం చేస్తానన్న మాధవన్‌ను తల్లిదండ్రులు వారించినా "I want to transform what I study in to what I love'' అనుకుని..పనిచేసి దాచుకున్న డబ్బుతో ఆరు ఎకరాలు కొని వ్యవసాయం చేస్తే.. మొదట్లో నష్టం వచ్చింది. అయినా పట్టువిడవకుండా ఇజ్రాయెల్‌లోని డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని (750 లీటర్లు అవసరం అయ్యే దగ్గర లీటరు నీరు సరిపోతుంది) అవలంభించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నాడు.

వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో వ్యవసాయ రుణాలు ఎలా తీసుకోవాలో చెప్పేకంటే ఆచరణాత్మక ప్రయోగాలు చేయాలంటారు. తన పొలంలో ప్రతి ఎకరాలో 10 సెంట్లు పరిశోధనలకు కేటాయిస్తారు. అమెరికాలో గంట పనిచేసి మూడు భోజనాలు సంపాదిస్తే ఇక్కడ రోజంతా పనిచేసినా ఒక్క భోజనం రాని పరిస్థితి. దీన్ని మార్చాలి. లేకపోతే ఆహార అభద్రత అణుబాంబు కంటే ప్రమాదకరమైంది అంటారు మాధవన్. ఆయన లాంటి ఎందరో ఇంజనీర్లు తమ ఇంజనీరింగ్ జ్ఞానాన్ని తమ హృదయానికి నచ్చిన రంగంలో వినియోగిస్తే మనదేశాన్ని ఎంతముందుకు తీసుకువెళ్లవచ్చో? మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం మాధవన్ పొలాన్ని సందర్శించి అబ్బురపడి మనకు మిలియన్ మాధవన్‌లు కావాలన్నారు.

జీవితంలో అన్నీ మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే అన్వేషించాలి. జీవిత గమనంలోని ప్రతి మలుపులోనూ మనకు ఎన్నో పాఠాలు దొరుకుతాయి నేర్చుకోగలిగితే. ఉదయం నాలుగు గంటలకు లేచి, పేపర్లు వేసి, స్నానం చేసి చదువుకొని ఆ తర్వాత పై చదువులు ఉపకారవేతనంతో ఎంఐటీలో చదువుతున్నప్పుడు రెండురోజుల్లో ఆశించిన ఫలితం రాకపోతే ఉపకారవేతనం నిలిపివేస్తానన్న అధ్యాపకుని మాటలతో ఆ ఫలితాన్ని చెప్పిన సమయానికి అందించారు అబ్దుల్ కలాం. ఈ సంఘటన కాలం విలువ చెప్పడమే కాకుండా ఒక పని నిర్దేశిత సమయంలో పూర్తి కావడానికి కొంత ఆరోగ్యకరమైన ఒత్తిడి, మనసునిండా కాంక్ష అవసరమనే పాఠాన్ని నేర్పిందంటారు కలాం. అంతేకాకుండా ప్రతిమనిషి యజమానిగా మాత్రమే కాకుండా పనివాడిగా కూడా పనిచేయగలిగినపుడే విజయవంతమైన ఫలితాలు వస్తాయని తాను నేర్చుకున్న జీవితపాఠం అంటారాయన. స్కాలర్‌షిప్ ఆపేస్తానని టీచర్ అంటే ఎంతమంది ఇలాంటి పాఠాలు నేర్చుకుంటారు?

కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్
వ్యసనేనచ మూర్ఖాణాం నిద్రయా కలహేనచా

బుద్ధిమంతుడు శాస్త్ర విజ్ఞాన విషయాలను అధ్యయనం చేస్తూ స్వానుభవంతో ప్రావీణ్యత సాధిస్తాడు.
మూర్ఖులు వ్యసనాలు, నిద్ర, కలహాలతో కాలం వెళ్లదీస్తారు.

గొప్పవారిని చూసినా, వారి గురించి విన్నా మనకు కూడా వారిలా పేరు ప్రఖ్యాతులు వస్తే బాగుండుననిపిస్తుంది. అయితే విపత్కర పరిస్థితుల్లో, అసాధారణ సమస్యలు వచ్చినపుడు మనోనిబ్బరం కోల్పోకుండా వివేకం, సహనం, సూక్ష్మ గ్రాహ్యత, లోకజ్ఞానం ఉపయోగించి వారు ప్రతిస్పందించే తీరు వారినడక, నడత, నైపుణ్యాలను మనకు చెప్పడమే కాకుండా మనం నేర్చుకోవాల్సిన విషయాలను గుర్తు చేస్తుంది.

కాలేజీ చదువుల కోసం ట్యూషన్లు చెప్పి, స్వశక్తితో కొంతస్థాయికి ఎదిగి తర్వాత మైసూరు సంస్థానం వారి సాయంతో సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రథమస్థానాన్ని సాధించి.. మొదటి ఉద్యోగంలోనే సింధునది నీటిని సుక్కూరు పట్టణానికి తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్కడ పనిచేసినా తనదైన ముద్రను వేసేవారు. మహానది డ్యామ్ నుంచి వరదనీరు వృథాగా పోతుందని దాన్ని వాడుకోవడానికి ఆటోమేటిక్ స్లూయిజ్ గేట్లు తయారు చేశారు. మూసీనది వరదల్లో విలవిలలాడిన హైదరాబాద్‌ను హైదరాబాద్ చీఫ్ ఇంజనీరుగా డ్యామ్‌లు, బండ్‌లు, పార్కులు కట్టి సురక్షితంగా, సుందరంగానూ మలిచారు. కర్ణాటకలో కృష్ణరాజసాగర్ డ్యామ్‌ను నిర్మించి లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చారు. ైమైసూరు దివానుగా తనను నియమించినపుడు బంధువులందరినీ భోజనానికి పిలిచి, తన పదవి ద్వారా వారు ఎటువంటి స్వలాభాలనూ ఆశించనంటేనే ఆ పదవి చేపడతానని వారి దగ్గర మాట తీసుకునే వరకు పదవి చేపట్టలేదు. కానీ ఏ బంధువుకు ఏ అవసరం వచ్చినా తన జీతంలో నుంచి ఇచ్చేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే

"To give real service you must add something which cannot be bought or measured with money''
‘‘డబ్బుతో కొనలేనిది, వెలకట్టలేనిది ఏదైనా జోడించగలిగితేనే మనం నిజంగా సేవచేసినట్లు’’

అంత మహానుభావుడు కాబట్టే ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15ను ‘ఇంజనీర్‌‌స డే’గా జరుపుకుంటాం. ఆయన జీవితంలో నుంచి నేర్చుకోగలిగిన నేర్పు, నమ్రత ఉన్నవారికి ఎన్ని నాయకత్వ పాఠాలు.

అభివాదస్య శీలస్య నిత్యం వృద్ధో పసేవిన:
చత్వారి తస్య వర్ధన్త ఆయు: ప్రజ్ఞా యశో బలం

ఎవరైతే విజ్ఞులు, మహానుభావుల పట్ల వినమ్రతతో, భక్తిభావంతో ఉంటారో వారి ఆయువు, వివేకం, యశస్సు, బలం వృద్ధి చెందుతాయి.

ఒక ప్రముఖ కంపెనీ క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఎంపికైన విద్యార్థులకు ఇలా ఉత్తరం రాసింది.
‘‘మీలో చాలామంది డిగ్రీ పూర్తి చేస్తున్నందుకు, మొదటి ఉద్యోగంలో చేరుతున్నందుకు చాలా ఆనందంగా గర్వంగా భావిస్తుంటారు. మీకు రాబోయే జీతాల గురించి, పదవుల గురించి చర్చించుకుంటూ ఉంటారు. కానీ మేము మాత్రం మీరు పంపిన బయోడేటాలు చూస్తూ మీ నాణ్యత, మీ నైపుణ్యం, మీ ఉత్పాదకత, మీ విశ్వసనీయత ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతూ రాస్తున్నాం. కానీ మీకు చెప్పకపోతే మీ తరం, మీ తర్వాతి తరం కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకోక నాణ్యతా ప్రమాణాలను తగ్గించి వేస్తాయనే ఆందోళనతో రాస్తున్నాం.

మీరు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలం, రాయగలం అని బయోడేటాలో రాస్తారు. కానీ సగానికిపైగా బయోడేటాల్లో ఇంగ్లిష్ తప్పుల తడకలు. ప్రపంచస్థాయిలో పనిచేయడానికి అవసరమైన భాషలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం లేదా? ఆలోచించండి?

సమస్యా పరిష్కార నైపుణ్యం పుష్కలంగా ఉందని రాస్తారు. ఇంతకుముందు మీ సీనియర్లు కూడా ఇలాగే రాశారు. ఎప్పుడు చిన్న సమస్య వచ్చినా నిబ్బరంగా పరిష్కారం ఆలోచించకుండా వెంటనే ఏం చేయాలని అడుగుతారు. మీస్థాయి సమస్య మీరు పరిష్కరించలేకపోతే మీరు మీ సంస్థలో ఆత్మవిశ్వాసంతో ఎలా పని చేయగలరు? ఇప్పటినుంచైనా ఈ అలవాటు చేసుకుంటారని ఆశించవచ్చా?

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త మెళకువలు నేర్చుకుంటామని మాట ఇచ్చి బాధ్యతలు చేపడతారు. విధుల్లో చేరిన తర్వాత నేర్చుకోవడమే మానేస్తున్నారు. నైపుణ్యాన్ని మెరుగుపరచుకోకుండా మెరుగైన జీతం ఇవడం ఎలా సాధ్యం?

సంస్థ పట్ల పూర్తి నిబద్ధతతో సంస్థ పురోభివృద్ధికి తోడ్పతామని చెబుతారు. కానీ కాస్త మెరుగైన జీతం ఎవరైనా ఇస్తానంటే అవకాశం వచ్చిన వెంటనే సంస్థను వదిలి వెళ్లిపోతారు. మేము మిమ్మల్ని అర్ధంతరంగా సంస్థ నుంచి బయటకు పంపితే మీరు ఎంత బాధపడతారో అవసరమైన సమయంలో మీరు సంస్థను వదిలేస్తే ఆ సంస్థకు ఎంత కష్టమౌతుందో ఆలోచించారా? మీ విశ్వసనీయతను ఎలా విశ్వసించడం?

మీకు వ్యక్తిగత అవసరం ఉన్నపుడు ఆఫీసుకు ఆలస్యంగా వచ్చినా ఏమీ అనకూడదని మీరు అనుకోవడం తప్పుకాదు. కానీ సంస్థకు అవసరమైనపుడు సహజమైన ఇష్టంతో మీరు సంస్థ సమస్యను పరిష్కరించడంలో తోడ్పడాలని ఆశించడం అత్యాశా?

మీ కెరీర్ ఆరంభం-అంతం కూడా మీ చేతిలోనే ఉంది. ఒక మీరు వీలైనంత నైపుణ్యం, సామర్థ్యం పెంచుకుని మీకు, మీ కుటుంబానికీ, మీ సంస్థకూ, దేశానికీ ఒక తరగని ఆస్తిగా మారాలని - ఒక బాధ్యతాయుతమైన కంపెనీగా మా ఆకాంక్ష. భాషా నైపుణ్యం, జ్ఞాన తృష్ణ, స్వవివేకం, విలువలతో కూడిన భాగస్వామ్యం, Professionalism - ఇవి మీ ఎదుగుదలకు, మీ ద్వారా మా ఎదుగుదలకు మెట్లు/పునాదులు.

నిజాయితీతో ఆత్మావలోకనం చేసుకుని, సుహృద్భావంతో అర్థం చేసుకుని సహకరిస్తూ సంస్థలో శాశ్వత భాగస్వాములవుతారని ఆశించవచ్చా?

ఈ ఉత్తరం మనందరికీ ఏదో ఒక విషయంలో వర్తిస్తుంది. మరి వారు పేర్కొన్న ప్రొఫెషనలిజం అంటే ఏమిటి?
తండ్రి లేని ఐదేళ్ల మహదేవ అనే చిన్న కుర్రవాడిని.. అతని తల్లి ఏదో ఒక పనిచేస్తూ పోషించేది. అనారోగ్యంతో చనిపోయిన తన తలి అంత్యక్రియలు అనాథలా జరిగాయిని భావించి తన తల్లిలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని భావించి... ఎవరూ లేనివారికి తనే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసేవాడు. ఇప్పటి
వరకూ దాదాపు 45 వేల మందికి అలా శ్రద్ధగా అంత్యక్రియలు చేశాడు. ఇంకా చేస్తున్నాడు. అతను మృతదేహాలను ఏదైనా నదిలో పారేసినా అడిగేవారు లేరు. కానీ ఎటువంటి పర్యవేక్షణ లేకుండా తను నిర్ధారించుకున్న ప్రక్రియ ప్రకారం అంకితభావంతో పని పూర్తి చేసేవాడు. మరి జీతం తీసుకుంటూ మన పని మనం చేయడానికే 10 సార్లు చెప్పించుకుని, పర్యవేక్షకుడితో తిట్లు తిని, ఆ భయంతో పనిపూర్తి చేసే మనలో ప్రొఫెషనలిజం ఉందా? లేదా? ప్రశ్నించేవారు, పర్యవేక్షణ లేకున్నా పూర్తి నిబద్ధతతో మహదేవ చేసేపనిలో ప్రొఫెషనలిజం ఉందా? అనేది ప్రతి రంగంలో తమని తాము ప్రొఫెషనల్ అని పిలుచుకునే ప్రతివారూ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన వాస్తవ ఉదాహరణ. ప్రొఫెషనలిజం అంటే డిగ్రీలు, కోర్సులు, దుస్తులు, వాహనాలు, ఐడెంటిటీ కార్‌‌డ్స.... ఇవేనా? లేదా పర్యవేక్షణ ఉన్నా లేకున్నా తన పనిని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడమా? కంపెనీవారు రాసిన ఉత్తరం, మహాదేవ ఉదాహరణ కింది సుభాషితాన్ని గుర్తుకు తెస్తాయి.

గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః ప్రయోజనమ్
విక్రయన్తే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః

నాకీ గుణాలున్నాయని చెప్పడం కంటే ఆ గుణాలు అలవర్చుకోవడం అత్యవసరం.
మెడలో గంటకట్టినంత మాత్రాన పాలివ్వని ఆవును మభ్యపెట్టి అమ్మినా.. వాస్తవం తెలిసి వదిలివేస్తారు.

ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర్ తన పరిశోధనల సారాన్నంతా చక్కని సొంపైన భాషలో, ఒక చదివింపచేసే శైలిలో వ్యాసాలు రాసేవారు. క్లాసిక్స్‌తోపాటు ఆంగ్ల కవులైన టి.ఎస్.ఇలియట్, షేక్‌స్పియర్, హెమింగ్‌వే లాంటి ప్రముఖ రచయితల రచనలు చదువుతున్నప్పుడు, తన పరిశోధనల సారాన్ని వారిలాగా చదివింపచేసేలా, ఆనందింప చేసేలా ఎందుకుండకూడదని ఒక విలక్షణశైలిలో రాసేవారు. ఇది శాస్త్ర సాంకేతిక పరిశోధనా వ్యాసాల్లో బహు అరుదు. అందుకే అంత గొప్పవాడయ్యారు చంద్రశేఖర్. ఆయన ఏం చేసినా పరిపూర్ణత్వం, కళాత్మకత, సౌందర్యాభిలాష నిండుగా కనిపించేవి. ""Science is not only a way of making discoveries but a way of life'' సత్యం సౌందర్యం వీటిని విడదీయలేమని సైన్సుని ప్రోత్సహించి, కళని విస్మరించలేమనీ, సైన్సులో అవసరమయ్యే క్రమశిక్షణ, పట్టుదల, హేతుబద్ధత, దృక్పథం లాంటివి పాటిస్తూనే సంగీతం, కళలు, సాహిత్యంలో కూడా అభిరుచిని కలిగిఉండి పరిపూర్ణ మానవ నిపుణుడిగా వికసించడం ప్రతి విద్యార్థికి అవసరం. ఈ సమతుల్యత, సమన్వయం ఈనాటి యాంత్రిక జీవన గమనానికి పరిష్కారమేమైనా చూపిస్తుందేమో.

ఒక వ్యక్తి విద్యాపరంగా/ కెరీర్ పరంగా ఉన్నతస్థానానికి ఎదగడానికి అతని పట్టుదల, పరిశ్రమ, పనితనంతోపాటు కుటుంబంలో అందరూ లేదా వీలైనంతమంది తమతమ స్థాయిలో వీలైనంత త్యాగాలు చేస్తారు. ఆ ఫలితం సామూహికంగా కుటుంబ సభ్యులందరిదీ. మూలాలు మరిచిన వారినీ, అసూయాపరులను, అహంకారులను, అజాగ్రత్తపరులనూ ప్రకృతి ప్రోత్సహించదు. యక్ష ప్రశ్నలలో ధర్మరాజు - సుఖానికి ఆధారమైనది ఏది అని యక్షుడడిగితే ‘శీలం’ అంటాడు. సంపద అనలేదు. సుఖాల్లో గొప్పది ఏది అనడిగితే సంతోషం అన్నాడు. ఎవరు సంతోషంగా ఉంటాడు అనడిగితే యాచించకుండా తనకున్న దానిని తనవారందరితో ఆనందంగా పంచుకుని తృప్తి చెందేవాడు అని సమాధానమిస్తాడు. అందువల్ల ఉన్నతికి కారణమైన వారందరిపట్లా జీవితాంతం కృతజ్ఞతాభావంతో ఉండటమే వారికి మనం ఇచ్చే మర్యాద.

ఈ సందర్భంలో మార్టిన్ లూథర్ కింగ్ తను నోబెల్ ప్రైజ్ అందుకుంటూ అన్నమాటలు. ""we should be grateful not only to known pilots but also unknown ground crew'' విమానం ఎగురుతుందంటే అందరూ నడుపుతున్న పైలట్‌ను చూస్తారు కానీ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్‌స్టాఫ్ పగలూ, రాత్రీ శ్రమించి విమానాన్ని ఎగరడానికి సమానంగా తోడ్పడతారని ఆలోచించరు. ఎందుకంటే వారు ముఖ్యాంశాల్లో ఉండరు. కానీ పైలట్ విజ్ఞడయితే వారి శ్రమను గుర్తుంచుకొని వారిని మనసునిండా ఉంచుకోవాలి. ఉన్నతస్థితికి ఎదిగినా తన ప్రాథమిక సూత్రాలను మరవకూడదు. ఢిల్లీ మెట్రోను, కొంకణ్ రైల్వేను అనుకున్న దానికంటే ముందే పూర్తిచేసిన కర్మయోగి శ్రీధరన్ ఇప్పటికీ తెల్లవారుజామునే నిద్రలేస్తారు. ధ్యానం, భగవద్గీతా పఠనానికి రెండు గంటలు కేటాయిస్తారు. పని సమయంలో పూర్తిగా పని, విశ్రాంతి సమయంలో పూర్తిగా విశ్రాంతి, ఆహార సమయానికి ఆహారం లేకపోతే రెండు అరటిపండ్లతో ఆకలి తీర్చుకోవడం, సాధారణ జీవనశైలినే అనుసరించడం అందరికీ ఆచరణీయం. ఎందుకంటే..

ఆచారాల్లభతేః ఆయుః ఆచారా దీప్సితాః ప్రజా
ఆచారాద్ధనమక్షయ్యమ్ ఆచారోహన్త్యలక్షణమ్

మంచి శీలం, నడవడిక ఉంటే ఆయుర్వృద్ధి, సత్సంతానం, తరగని సంపద, (కీర్తి), లభించడమే కాకుండా ఏవైనా చిన్నలోపాలుంటే నశించిపోతాయి. Rudyard kipling మాటల్లో చెప్పాలంటే...

If you can talk with crowds and keep your virtue or walk with the kings - nor loose the common touch yours is the earth and everything that's in it and which is more- you will be a man my son.

జన సందోహంలో ఉంటూ కూడా తన విశిష్ట గుణాలను కోల్పోనివాడు, గొప్పవారితో తిరుగుతూ కూడా తన సామాన్య, సాధారణ ప్రవృత్తిని కోల్పోనివాడు అసలైన మనిషి.
అందుకే
నచ్చిన పనిని చేపడదాం
చేపట్టిన పని పనిబడదాం
ఎందుకంటే ధర్మరాజు చెప్పినట్లు
(యక్ష ప్రశ్నలకు సమాధానమిస్తూ)

ధాన్యానాముత్తమం దాక్ష్యం
గొప్పతనాల అన్నింటిలోనూ
ఉత్తమమైన గొప్పదనం.. చేపట్టిన పనిలో నేర్పరితనమే.

Thursday, October 2, 2014

A time for celebration,
A time for victory of good over bad,
A time when world see the example of power of good.
Let us continue the same "true" spirit.
Blessing Of dussehra.

HAPPY DUSSEHRA